హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు
*తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని పిటిషన్
Shakeel Son: బేగంపేట్ వద్ద కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ప్లాన్ ప్రకారమే తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారని ఆరోపించాడు సాహిల్. అయితే కారు ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో.. సాహిల్ స్నేహితుడు ఆసిఫ్‌ను మొదటి నిందితుడిగా చేర్చామని పోలీసులు తెలిపారు.
ప్రమాదం తర్వాత అక్కడి నుంచి పరారైన సాహిల్ ఆచూకీ కోసం ఆసిఫ్‌ను విచారిస్తే తప్పు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి సాహిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలంటూ సాహిల్ హైకోర్టును ఆశ్రయించాడు. పోలీసులు కావాలనే ఆసిఫ్‌పై ఒత్తిడి తెచ్చి తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారంటూ పిటిషన్‌లో తెలిపాడు సాహిల్.