Ponnam Prabhakar: ధాన్యం కొనుగోలులో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు నాటకాలాడుతున్నాయి

Ponnam Prabhakar: రైతుల శ్రమతో రాజకీయం చేస్తున్నారు

Update: 2022-04-12 14:08 GMT

బీజేపీ, టీఆర్ఎస్ పై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు

Ponnam Prabhakar: ధాన్యం కొనుగోలులో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తున్నాయన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఆద్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటన్నారు. రైతులను క్షోభపెట్టే పనులు మానుకోవాలనారు. ప్రతి ధాన్యం గింజను కొంటామని రైతులకు హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ తీరా పంట చేతికి వచ్చిన తర్వాత దొంగ దీక్షల నాటకానికి తెరలేపారన్నారు.

బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు తప్ప.. యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో పరిష్కారం కనుగొనలేకపోతున్నారన్నారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి ఉద్యమిస్తామని చెప్పారు.  

Tags:    

Similar News