అమిత్‌షాను కలిసిన ఈటల రాజేందర్

కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది.

Update: 2024-06-10 09:17 GMT

అమిత్‌షాను కలిసిన ఈటల రాజేందర్

తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అమిత్‌షాను ఈటల రాజేందర్‌ కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. కిషన్‌రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్‌రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ పదవిలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్‌ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తుండటం.. తాజాగా కేంద్రమంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికే పరిమితం చేస్తారని చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News