Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా.. నవంబరు 30న తెలంగాణ ఎన్నికలు..

Assembly Elections 2023: ఎన్నికల సందడి మొదలైంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది.

Update: 2023-10-09 07:08 GMT

Assembly Elections 2023: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగారా.. నవంబరు 30న తెలంగాణ ఎన్నికలు..

Assembly Elections 2023: తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 679 నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది.

తెలంగాణలో నవంబరు 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్‌లో నవంబరు 23న, మధ్యప్రదేశ్‌లో నవంబరు 17న, మిజోరంలో నవంబరు 7న ఒకే విడతలో పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో నవంబరు 7న తొలి విడత, నవంబరు 17న రెండో విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల్లో డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణలో 3.17కోట్ల మంది, రాజస్థాన్‌లో 5.25కోట్లు, మధ్యప్రదేశ్‌లో 5.6 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 2.03కోట్లు, మిజోరంలో 8.52లక్షల ఓటర్లున్నారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం ఆరు నెలలుగా కసరత్తు చేశామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. పలు రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించామని.. ఐదు రాష్ట్రాల అధికారులు, పార్టీల నేతలతో చర్చలు జరిపామని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో మొత్తం 679 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో 60 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు పొందారు. అన్ని రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని. మిజోరం, ఛత్తీస్‌గడ్‌లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉందని సీఈసీ తెలిపారు. ఈ ఎన్నికల్లో వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం కల్పించామని చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్నారు రాజీవ్ కుమార్.

Tags:    

Similar News