Mahesh Cooperative Bank: మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈడీ సోదాలు…300కోట్ల గోల్‌మాల్ కేసులో విచారణ
Mahesh Cooperative Bank: నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో అనర్హులకు రుణాలు ఇచ్చారని ఆరోపణలు
Mahesh Cooperative Bank: హైదరాబాద్‌లో ఆరు చోట్లు ఈడీ సోదాలు నిర్వహించింది. మహేష్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్, ఎండీ పురుషొత్తందాస్, సీఈఓ, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ తనిఖీలు చేపట్టింది. నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్లతో అనర్హులకు రుణాలు ఇచ్చారన్న ఆరోపణలపై ఈడీ కేసు నమోదు చేసింది. 300 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ జరిగినట్టు భావిస్తున్నారు. హవాలా ద్వారా డబ్బుు మళ్లించినట్టుగా ఈడీ గుర్తించింది.