Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ నోటీసులు
Delhi Liquor Case: రేపు విచారణకు హాజరుకావాలని నోటీసులు
Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఈడీ మరోసారి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. రేపు లిక్కర్ స్కాంలో విచారణకు రావాలని తెలిపింది. లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కవితను గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు విచారించింది ఈడీ. గతేడాది సెప్టెంబర్‌లో మరోసారి నోటీసులు ఇవ్వగా.. మహిళను ఈడీ ఆఫీస్‌లో విచారించడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉండగానే మరోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. దీంతో కవిత రేపు విచారణకు హాజరవుతారా లేదా అనే సందిగ్ధత నెలకొంది.
లిక్కర్ స్కాంలో కవిత ఇన్వాల్వ్ అయ్యారంటూ ఈడీ అభియోగాలు దాఖలు చేసింది. స్కాంకు సంబంధించిన ఆధారాలు చెరిపేసేందుకు తన ఫోన్లను ధ్వంసం చేశారని పేర్కొంది. అయితే గతంలో విచారణకు హాజరైన కవిత తాను వాడిన ఫోన్లను ఈడీకి సమర్పించారు.