TS Elections: అభ్యర్థుల ఖర్చుపై ఈసీ ధరలు నిర్ణయం.. చికెన్‌ బిర్యానీ రూ.140.. టిఫిన్‌ రూ.35

TS Elections: ఎంపీ అభ్యర్థు ఖర్చు రూ.90 లక్షలు

Update: 2023-10-12 05:40 GMT

TS Elections: అభ్యర్థుల ఖర్చుపై ఈసీ ధరలు నిర్ణయం.. చికెన్‌ బిర్యానీ రూ.140.. టిఫిన్‌ రూ.35

TS Elections: శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రచార ఖర్చులను కచ్చితంగా లెక్కించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు, కార్యకర్తలకు కాఫీ, టీ, టిఫిన్‌, బిర్యానీల కోసం చేసే వ్యయాన్ని అభ్యర్థులు గతంలో తక్కువగా చూపించేవారు. అందుకు ఆస్కారం లేకుండా ఈసారి ఎన్నికల అధికారులు ధరల జాబితాను రూపొందించారు. దాని ఆధారంగానే ఖర్చులను లెక్కించనున్నారు. నీళ్ల ప్యాకెట్‌ నుంచి మొదలుకుని, సభలు, సమావేశాల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, ఎల్‌ఈడీ తెరలకు సైతం ధరలను నిర్ణయించారు.

ఒక్కో బెలూన్‌కు 4 వేల రూపాయలు, ఎల్‌ఈడీ తెరకు 15 వేల రూపాయలు రోజు అద్దెగా పరిగణిస్తారు. ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహిస్తే పట్టణ ప్రాంతాల్లోనైతే రోజుకు 15 వేల రూపాయలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి. ఎన్నికల సంఘానికి అభ్యర్థి సమర్పించే ఎన్నికల వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, వాహనాల కిరాయి, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలూ ఉండాలని స్పష్టం చేశారు.

ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నా.. అత్యధిక మంది ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితి లోపే లెక్కలు చూపిస్తున్నారు. ఈ పరిమితిని పెంచితే కొంతైనా అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం అభ్యర్థుల వ్యయాన్ని 2022లో పెంచింది. 2014లో ఎంపీ అభ్యర్థి పరిమితి గరిష్ఠంగా 75 లక్షల రూపాయలు ఉండగా, 2022లో ఆ మొత్తాన్ని 90 లక్షల రూపాయలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని 28 లక్షల నుంచి 40 లక్షల రూపాయలకు పెంచింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యయ పరిమితిని పెంచింది.



Tags:    

Similar News