టీఎస్‌ కేబినెట్‌ భేటీకి సీఈసీ నో పర్మిషన్‌

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు.

Update: 2024-05-18 09:42 GMT

టీఎస్‌ కేబినెట్‌ భేటీకి సీఈసీ నో పర్మిషన్‌

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో మంత్రులతో సమావేశం కావాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ భేటీపై ఎన్నికల కమిషన్ కు సమాచారం కూడా ఇచ్చింది ప్రభుత్వం. మంత్రుల సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అయితే.. తీసుకున్న నిర్ణయాలను మాత్రం బయటకు వెల్లడించకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం 4 గంటలకు కేబినెట్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే.. రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండడంతో ఈసీ అనుమతి ఇవ్వలేదు. దీంతో మంత్రులతో సమావేశం కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Tags:    

Similar News