Droupadi Murmu: నేడు యాదాద్రికి రాష్ట్రపతి ముర్ము
Droupadi Murmu: స్వామివారిని దర్శించుకోనున్న ద్రౌపదీ ముర్ము
Droupadi Murmu: నేడు యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధికి రాష్ట్రపతి ముర్ము రానున్నారు. ఉదయం 9గంటల 30 నిమిషాలకు రానున్న రాష్ట్రపతి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు సుమారు గంటపాటు ఆలయంలో గడపనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, పోలీస్ ఉన్నతాధికారులు పూర్తి చేశారు. ఆండాళ్ అమ్మవారి సన్నిధి, ఆళ్వార్ సన్నిధిని రాష్ట్రపతి సందర్శిస్తారు. పశ్చిమ పంచతల రాజగోపురం నుంచి మాఢవీధుల్లోకి ప్రవేశించి, అద్దాల మండపం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణాలను పరిశీలిస్తారు. అనంతరం ఉత్తర రాజగోపురం గుండా తిరుగు ప్రయాణమై కొండకింద హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రి పర్యటన సందర్బంగా పటిష్ట భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 1,200 మంది పోలీసులతో భద్రతను చేపట్టనున్నారు. పట్టణంలోని ప్రధానరోడ్డు, కొండ చుట్టూ, కొండపైకి వెళ్లేదారిలో పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు కొండపైకి వాహనాలను అనుమతించరు.