Digital Classes for Telangana Students: ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు షూరూ !
Digital Classes for Telangana Students: కరోనా వైరస్ అన్ని రంగాలను మార్చేసింది. ముఖ్యంగా విద్యారంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్ధుల భవిత్యం ప్రశార్ధకరంగా మారింది.
Digital Classes for Telangana Students: కరోనా వైరస్ అన్ని రంగాలను మార్చేసింది. ముఖ్యంగా విద్యారంగంపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. స్కూళ్లు, విద్యాసంస్థలు మూతపడటంతో విద్యార్ధుల భవిత్యం ప్రశార్ధకరంగా మారింది. ఈ తరుణంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన సంస్కరణలకు శ్రీకారం చూడుతున్నాయి.ఈ నేపథ్యంలో తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డిజిటల్ బోధనను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ప్రాథమిక తరగతులకు వర్క్ షీట్స్, అసైన్‌మెంట్స్ ఇవ్వడంతో పాటు 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు వీడియో పాఠాలను ప్రసారం చేసేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే 900 పైచిలుకు డిజిటల్ పాఠాలను రూపొందించారు. వీటిని టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్ల ద్వారా ఆగస్టు 15 నుంచి ప్రసారం చేసేలా కసరత్తు చేస్తోంది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా 'ప్రజ్ఞత' పేరుతో ఆన్‌లైన్, డిజిటల్ విద్యకు రూపొందించిన మార్గదర్శకాలను రూపొందించింది. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు తరగతుల వారిగా సమయాన్ని కేటాయించనున్నది. ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సబ్జెక్టు టీచర్లను అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇక గ్రామాల్లో ఉన్న విద్యార్థులు నేరుగా స్కూలుకు వెళ్లి నేర్చుకునేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. మిగిలిన అంశాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తర్వలోనే తెలపనున్నదని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది.