Kondagattu: కొండగట్టు ఆలయంలోకి తిరిగి భక్తులకు అనుమతి
Kondagattu: కొండగట్టుతో పాటు మరో రెండు ఆలయాల్లో చోరీ
Kondagattu: కొండగట్టు ఆలయంలోకి తిరిగి భక్తులను అనుమతిస్తున్నారు. ఆలయంలో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం 15టీమ్‌లను ఏర్పాటు చేశారు. అర్థరాత్రి ముగ్గురు వ్యక్తులు చొరబడినట్లు పోలీసులు గుర్తించారు. స్వామి వారి వెండి కవచం, శ్రీరామ రక్షా, శఠగోపం, తోరణం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. కొండగట్టుతో పాటు మరో రెండు ఆలయాల్లో కూడా చోరీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.