Bhatti Vikramarka: టీఎస్ఆర్టీసీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష
Bhatti Vikramarka: చార్జీలు పెంచకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలి
Bhatti Vikramarka: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఆర్టీసీ అమలు చేయడానికి నిధులు ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా చార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టాలని ఆయన అధికారులకు సూచించారు. తెలంగాణ సచివాలయంలో టీఎస్ఆర్టీసీ పై మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సంస్థ ఉన్నతాధికారులు భట్టి విక్రమార్కకు వివరించారు.