CPI Narayana: ప్రజా దర్భార్‌ను నిర్వహించి గవర్నర్ లక్ష్మణరేఖ దాటారు.. తెలంగాణ గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలి..
CPI Narayana: తమిళిసై లక్ష్మణ రేఖ దాటారు.. తెలంగాణ గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలి..
CPI Narayana: గవర్నర్లపై ఘాటైన వ్యాఖ్యలు చేసారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బిజెపి నియమిత గవర్నర్లు. ఈ క్రమంలోనే తమిళసై ప్రజా దర్బారు ఎలా నిర్వహిస్తారని అన్నారు. ప్రజలు ఇచ్చే సమస్యలు ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు.తమిళిసై లక్ష్మణ రేఖ దాటారని అన్నారు. బిగ్ బాస్ పై మరోసారి తన అభిప్రాయాన్ని గట్టిగా వ్యక్తం చేసారు. బిగ్ బాస్ ని విమర్శిస్తే మహిళలను విమర్శించినట్టు కాదన్నారాయన. పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి విగ్రహాలను పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలి. దీనిపై తెలంగాణ, ఏపి సీఎం లు కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని కోరారు.
కేంద్రమంత్రి మండలిలో నేరస్తులు ఉన్నారు. వారిని వదిలి జార్ఖండ్ సీఎం సోరేన్ ను సీఎం పదవి నుంచి తప్పించాలని చూసారని దుయ్యబట్టారు. దేశాన్ని దోచుకుంటున్న అదానీ జోలికి ఎందుకు వెళ్లరు. అదానీ ఒకప్పుడు స్మగ్లర్ అని ఆరోపించారు. తమను వ్యతిరేకిస్తున్నందునే ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుటుంబాన్ని బిజెపి ఇరికించాలని చూసిందని తెలిపారు.బిజెపిని వ్యతిరేకిస్తున్న పార్టీలు, నేతలు ఒకే గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. బిజెపిని నిలదీయడానికి జగన్ భయపడుతున్నారు.
అలిపిరి వద్ద టీటీడీ స్థలాన్ని ఒబరాయ్ స్టార్ హోటల్ కు కేటాయిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని రద్దు చేసి టీటీడీ నే భక్తులకు సౌకర్యాలు కల్పించే స్పీరుచువల్ టౌన్ షిప్ చేయాలి, లేదంటే సీపీఐ పోరాటం చేస్తుందని హెచ్చరించారాయన.
గవర్నర్ తమిళిసై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. గవర్నర్ కార్యాలయంలో ప్రజా దర్బార్ ఎలా నిర్వహించి లక్ష్మణ రేఖ దాటారని విమర్శించారు. ప్రజలు చెప్పే సమస్యలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసైని వెంటనే రీకాల్ చేయాలని నారాయణ డిమాండ్ చేశారు.