CPI Narayana: కవిత సీబీఐ విచారణను లైవ్ పెట్టాలని CPI నారాయణ డిమాండ్
CPI Narayana: సీబీఐ ఎందుకు చేయదని ప్రశ్నించిన నారాయణ
CPI Narayana: కల్వకుంట్ల కవితపై జరుగుతున్న సిబిఐ విచారణ లైవ్ పెట్టాలని CPI నారాయణ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థల ద్వారా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయని ఆయన అన్నారు. న్యాయస్థానాలు సైతం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయని.... లైవ్ టెలికాస్ట్ చేయడంలో సీబీఐకి వచ్చిన ఇబ్బంది ఏమిటని నారాయణ ప్రశ్నించారు.