Basara: బాసర సరస్వతి అమ్మవారి ఆలయ ప్రసాదంలో గోల్‌మాల్

Basara: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రసాదంలో గోల్ మాల్ జరగింది.

Update: 2024-06-28 10:00 GMT

Basara: బాసర సరస్వతి అమ్మవారి ఆలయ ప్రసాదంలో గోల్‌మాల్

Basara: నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రసాదంలో గోల్ మాల్ జరగింది. లడ్డు, పులిహోర ప్రసాదంలో కింది స్థాయి ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించినట్లు తేలింది. పులిహోర బండిలో 690 ప్యాకెట్లు ఉండగా రిజస్టర్ బుక్‌లో కేవలం 350 మాత్రమే ఎంట్రీ చేశారు. పూజల్లో పాల్గొన్న గ్రామస్థులు పులిహోర బండి ఆపి తనిఖీ చేయగా అధికారుల చేతివాటం వెలుగులోకి వచ్చింది.

ఆలయ ఈవో విజయరామారావు దృష్టికి గ్రామస్థులు తీసుకెళ్లారు. టికెట్ కౌంటర్ పరిశీలించగా చింపని టికెట్లు ఉన్నట్లు ఈవో విజయరామారావు గుర్తించారు. ఇవేంటని అక్కడే ఉన్న ఇంఛార్జిని వివరణ కోరగా నీళ్లు నమిలారు. దీంతో లడ్డు, పులిహోర ఇంఛార్జి అధికారులపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు.

Tags:    

Similar News