ఇవాళ గాంధీ భవన్‌లో కాంగ్రెస్ నిరసన దీక్ష
Revanth Reddy: ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తే... ఇంతలా శిక్షిస్తారా?
Gandhi Bhavan: కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పట్ల కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆపార్టీ నాయకులు ఇవాళ గాంధీ భవన్ లో నిరసన దీక్ష చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై లోక్ సభలో అనర్హత వేటు వేసి రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. బిజెపి నాయకులతో సత్సంబంధాలున్నవారు అవినీతి, అక్రమాలకు పాల్పడుతు, దేశ ఆర్థిక వ్యవస్థను నీరుగారుస్తున్నారని పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ నిలదీయడంతో కక్షగట్టి వేటు వేశారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తంచేశారు.