Congress: కాంగ్రెస్‌ దూకుడు.. తొలి జాబితాలో 100కు పైగా అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌

Congress: నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థుల కసరత్తు

Update: 2024-03-08 03:37 GMT

Congress: కాంగ్రెస్‌ దూకుడు.. తొలి జాబితాలో 100కు పైగా అభ్యర్థులను ప్రకటించనున్న కాంగ్రెస్‌

Congress: లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌ నాయకత్వం దూకుడు పెంచింది. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానున్నది. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయనున్న పార్టీ అభ్యర్థులను ఖరారు చేయనున్నది. సమావేశానికి సీఎం, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా తొలి జాబితాలో వంద మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించనుండగా, తెలంగాణ నుంచి 10 మంది పేర్లు ఉండే అవకాశం ఉంది.

పది నియోజకవర్గాల విషయంలో పీసీసీ ఎన్నికల కమిటీలో ఏకాభిప్రాయం కుదరడంతో ఆ జాబితాను ఇప్పటికే సీఈసీకి అందజేసింది. హైదరాబాద్‌ నుంచి అలీ మస్కట్‌, సికింద్రాబాద్‌ నుంచి బొంతు రామ్మోహన్‌, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి సురేశ్‌షట్కర్‌, కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌రెడ్డి, నిజామాబాద్‌ నుంచి జీవన్‌రెడ్డి, మహబూబాబాద్‌ నుంచి బలరాం నాయక్‌, మహబూబ్‌నగర్‌ నుంచి వంశీచందర్‌రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ, భువనగిరి నుంచి చామల కిరణ్‌రెడ్డి, నల్గొండ నుంచి జానారెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వరంగల్‌ నుంచి అద్దంకి దయాకర్‌, సర్వే సత్యనారాయణ పేర్లను సీఈసీ పరిశీలిస్తుంది. ఖమ్మం, మెదక్‌, నాగర్‌కర్నూల్‌, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు కాంగ్రెస్‌ అధిష్టానం కసరత్తు చేస్తుంది.

Tags:    

Similar News