KTR: ఎండుతున్న పొలాలు, మండుతున్న రైతుల గుండెలను చూడ్డానికి వచ్చాం
KTR: రాజకీయ కక్షతో ప్రాజెక్టు్ల్లో నీళ్లు నింపకుండా రైతులకు అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR: రాజకీయ కక్షతో ప్రాజెక్టు్ల్లో నీళ్లు నింపకుండా రైతులకు అన్యాయం చేయొద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేడిగడ్డ మేడిపండు అయిందని, లక్ష కోట్ల ప్రాజెక్టు కొట్టుకపోయిందని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలన్నీ ఉత్తవే అని తేలిపోయిందన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే 8నెలలుగా నీళ్లు నింపకుండా కాంగ్రెస్ చేసిన ప్రయత్నం అందరికీ కనబడుతూనే ఉందన్నారు కేటీఆర్. క్షేత్రస్థాయి పరిశీలనతో ఎండుతున్న రిజర్వాయర్లు, మండుతున్న రైతుల గుండెల్ని అసెంబ్లీ దృష్టికి తెచ్చేందుకే తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించామన్నారు.