Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆందోళన
Kakatiya University: అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల ఆవేదన
Kakatiya University: కాకతీయ యూనివర్సిటీలోని.. పోతన మహిళా హాస్టల్ లో పెచ్చులు ఊడి ఊపిపడిన ఘటనలో విద్యార్థినులు ఆందోళనకు గురయ్యారు.వసతిగృహాన్ని మార్చాలని ఎన్నిసార్లు విశ్వవిద్యాలయం అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వర్షాకాలంలో తమను పట్టించుకునే వారే కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం విద్యార్థినులను పోతన హాస్టల్ నుంచి కొత్త హాస్టల్ కు తరలిస్తున్నారు.