Revanth Reddy: రేపు సొంత జిల్లా పర్యటనకు సీఎం రేవంత్
Revanth Reddy: ఉమ్మడి జిల్లాలో సమస్యలపై మంత్రులు, అధికారులతో సమీక్ష
Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి రేపు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లా సమస్యలపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చేరుకోనున్న సీఎం.. అనంతరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహిళా గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్త్రీ శక్తి క్యాంటిన్‌ను ప్రారంభిస్తారు. జిల్లా కేంద్రంలోని ఓ పంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. ఇక సాయంత్రం 5.30 గంటల తర్వాత తిరిగి హైదరాబాదుకు రానున్నారు.