Revanth Reddy: రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు డిజిటల్ ప్లాట్ ఫారం

Update: 2024-03-06 09:57 GMT

Revanth Reddy: రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతులకు చేదోడు వాదోడుగా డిజిటల్ ప్లాట్ ఫారం ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వేదికలకు వీడియోకాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం ను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కలిసి ప్రారంబించారు. దశల వారీగా మూడు సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు స్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 97 కోట్లతో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నట్టు వివరంచారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో విస్తరణాధికారులుస, రైతులతో రైతు నేస్తం కార్యక్రమం అమలవుతుందని సీఎం చెప్పారు.

Tags:    

Similar News