Hyderabad: రాజధాని సిగలో.. డబుల్ డెక్కర్ కారిడార్.. నేడే శంకుస్థాపన
Hyderabad: అనంతరం బైరామల్ గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న రేవంత్‌రెడ్డి
Hyderabad: ఇవాళ ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి...సచివాలయంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అనంతరం ఎల్‌బీనగర్ సమీపంలోని బైరామల్ గూడ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించనున్నారు. వ్యూహత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వంతెనల్లో ఇది రెండో లెవల్ వంతెన. ఈ వంతెన ప్రారంభంతో బైరామల్‌గూడ చౌరస్తా 80శాతం మేర సిగ్నల్ ఫ్రీ జంక్షన్ కానుంది. నిర్మాణంలో ఉన్న లూప్ కూడా అందుబాటులోకి వస్తే సిగ్నల్ చిక్కులు లేని రాకపోకలకు అవకాశముంటుంది. అనంతరం ఉప్పల్ సమీపంలోని నల్లచెర్వు సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. జాతీయ రహదారి-44పై ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి మీదుగా ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి కండ్లకోయ వద్ద భూమిపూజ చేయనున్నారు.
హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజా రవాణా సవాళ్లు ఎదురవుతున్నాయి. మెట్రో రైలు వచ్చింది కదా అనుకుంటే, ఇప్పుడు అదీ సరిపోవట్లేదు. మెట్రోరైళ్లలో విపరీతమైన రద్దీ పెరిగిపోయింది. అస్సలు ఖాళీ ఉండట్లేదు. అందువల్ల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రవాణా మార్గాలను అన్వేషిస్తోంది. అందులో భాగంగా.. ఇవాళ 5 జిల్లాల్లోని ప్రజలకు వాహన కష్టాలు తీర్చేందుకు తొలి అడుగు వేస్తోంది ప్రభుత్వం. 1,580 కోట్లతో 5.320 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి కండ్లకోయ జంక్షన్ దగ్గర్లో శంకుస్థాపన చేస్తారు.
ఈ ఎలివేటెడ్ కారిడార్‌పై భవిష్యత్తులో రెండో దశలో మెట్రో రైలు మార్గాన్ని నిర్మిస్తారు. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయిన్‌పల్లి, డెయిరీ ఫామ్ రోడ్ NH 44 వరకూ ఉంటుంది. ఇది మొత్తం 6 లేన్ల రహదారి. దీని వల్ల సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరతాయి. అలాగే.. హైదరాబాద్ నుంచి మేడ్చల్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలకు మెరుగైన రవాణా సదుపాయం లభిస్తుంది.
పై నుంచి సాగే ఈ రహదారికి ఈ మధ్యే కేంద్ర రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. అందువల్ల ఇప్పుడు ఈ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇది ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై...తాడ్‌బండ్ జంక్షన్, బోయిన్‌పల్లి జంక్షన్ మీదుగా వెళ్తూ...డెయిరీ ఫామ్ రోడ్డు దగ్గర ముగుస్తుంది. ఇందులో పై నుంచి వెళ్లే కారిడార్ 4.650 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అండర్‌గ్రౌండ్ టన్నెల్ 0.6 కిలోమీటర్లు ఉంటుంది. దీనికి మొత్తం 73.16 ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో రక్షణ శాఖ ఇస్తున్నవి 55.85 ఎకరాలు ఉన్నాయి. అలాగే ప్రైవేట్ ల్యాండ్ 8.41 కిలోమీటర్లు ఉంది. ఇంకా అండర్‌గ్రౌండ్ సొరంగానికి రూ.8.9 ఎకరాలు కేటాయించారు. ఇది డబుల్ డెక్కర్ కారిడార్ పూర్తవ్వడానికి ఒక సంవత్సరం పట్టే అవకాశాలు ఉన్నాయి.