Revanth Reddy: కబ్జాదారులకు సీఎం రేవంత్‌రెడ్డి వార్నింగ్.. మా హైడ్రా రంగంలోకి దిగితే..
Revanth Reddy: చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
Revanth Reddy: చెరువులు, నాలాలు, కుంటల కబ్జాదారులకు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెరువులను కబ్జా చేసిన వాళ్లను వదిలి పెట్టబోమన్నారు. కబ్జా చేసిన వారు.. వారికి వారిగానే ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. లేకపోతే హైడ్రా రంగంలోకి దిగి నేలమట్టం చేస్తుందని హెచ్చరించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ దగ్గర కొందరు ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఫామ్ హౌస్‌లలోని డ్రైనేజీ నీరు జంట జలాశయాల్లోకి కలుపుతున్నారని చెప్పారు. చెరువులు, కుంటల్ని ఆక్రమించి కట్టిన కట్టడాల వల్ల ఆకస్మిక వరదలు వస్తున్నాయన్నారు. ఆక్రమణదారులు ఎంతటివరైనా వదిలిపెట్టేది లేదన్న ఆయన ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేసే బాధ్యత తమదే అని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కోర్టుల్లో కూడా పోరాడుతామని చెప్పుకొచ్చారు.