జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్ సర్కారు

*పబ్లిక్ గార్డెన్లో జాతీయ జెండా ఎగురవేయనున్న సీఎం కేసీఆర్

Update: 2022-09-17 01:10 GMT

జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్ సర్కారు

Telangana Unity Vajrotsavam: తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తొలుత సీఎం కేసీఆర్ పబ్లిక్ గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరిస్తారు. అక్కడినుంచి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభకు లక్షమందికి పైగా ఆదివాసీ గిరిజనులు పాల్గొనేవిధంగా ఏర్పాట్లు చేశారు. సభావేదిక ఏర్పాట్లను గిరిజన సంక్షేమశా‌ఖ మంత్రి సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాసయాదవ్ పరిశీలించారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో సీఎం కేసీఆర్ కీలక ప్రసంగం చేయనున్నారు. ఆదివాసీ గిరిజనుల రిజర్వేషన్, పోడు భూముల సమస్యపరిష్కారానికి సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు.

Tags:    

Similar News