KCR: సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారు.. 16 రోజుల షెడ్యూల్‌ విడుదల

KCR: ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటన, బహిరంగ సభలు ఉండేలా ప్లాన్‌

Update: 2023-10-11 02:10 GMT

KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. మొత్తం 16 రోజుల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 15న హుస్నాబాద్‌తో మొదలై.. నవంబర్‌ 8న బెల్లంపల్లి సభతో సీఎం కేసీఆర్ తొలిదశ ప్రచారం ముగియనుంది. మొత్తం 40 నియోజకవర్గాల్లో తొలివిడత ప్రచారం జరగనుంది. ప్రతిచోటా సీఎం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొంటారు. ఒక్కోరోజు రెండు, మూడు నియోజకవర్గాల్లో పర్యటన, బహిరంగ సభలు ఉండేలా ప్లాన్‌ చేశారు.

ఇప్పటికే అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ అధినేత ఖరారు చేశారు. ఎమ్మెల్యేల మొదటి దశ ప్రచార పర్వం కూడా ఇప్పటికే ముగిసింది. అటు.. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు సైతం రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు.. గులాబీ బాస్‌ కూడా స్వయంగా బరిలోకి దిగి ప్రచారపర్వం మొదలు పెడుతుండటంతో రాష్ట్రంలో ఎన్నికల జోరు ఊపందుకోనుంది. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌, బీజేపీ మాత్రం ఇప్పటివరకు ఇంకా అభ్యర్థులనే ఖరారు చేయలేదు.

Tags:    

Similar News