KTR: సిగ్గుచేటు.. చార్మినార్ గుర్తును తొల‌గిస్తారా

కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రలో చార్మినార్‌, కాకతీయ తోరణాలు తీసేయడం ఎంత అవమానం అని కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Update: 2024-05-30 06:59 GMT

KTR: సిగ్గుచేటు.. చార్మినార్ గుర్తును తొల‌గిస్తారా

KTR Tweet: ప్రపంచంలోనే అరుదైన వారసత్వ కట్టడాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చార్మినార్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అధికార చిహ్నంలో చోటు దక్కించుకోవడంపై విస్తృత చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం చార్మినార్‌పై రాజముద్ర వేయడం మరోసారి చర్చకు దారి తీస్తోంది. ఈనేపథ్యంలో కేటీఆర్ ట్విట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా, చార్మినార్ శతాబ్దాలుగా హైదరాబాద్‌కు చిహ్నం.. చిహ్నంగా ఉందన్నారు.

హైదరాబాద్‌ గురించి తలచుకుంటే, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన చార్మినార్‌ని తలచుకోకుండా ఉండలేరని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను చూపుతూ ఐకానిక్ చార్మినార్‌ను రాష్ట్ర లోగో నుండి తొలగించాలని కోరుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజముద్రలో చార్మినార్‌, కాకతీయ తోరణాలు తీసేయడం ఎంత అవమానం అని కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Tags:    

Similar News