Cess Election Counting: సెస్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
Cess Election Counting: 15 డైరెక్టర్ల స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీ
Cess Election Counting: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కో - ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సొసైటీ సర్వీస్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. వేములవాడ జూనియర్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 15 డైరెక్టర్ల స్థానాలకు 75 మంది అభ్యర్థులు పోటీలో పడ్డారు. మండలానికో రౌండ్ చొప్పున 26 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం మండలం ఓట్లను లెక్కించిన తర్వాత డైరెక్టర్ విజేతల వివరాలను విడుదల చేస్తామని ఎన్నికల అధికారి సునీత వెల్లడించారు. 15 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఈ కౌంటింగ్‌కు 90 మంది సొసైటీ సిబ్బంది పాల్గొననున్నారని తెలిపారు. ఈ కౌంటింగ్‌కు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలో ఉన్నట్లు నిర్ధారించిన తర్వాతే గెలిచిన అభ్యర్థులను ప్రకటించనున్నట్లు ఎన్నికల అధికారి సునీత తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కో - ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సొసైటీ సర్వీస్ ఎన్నికల్లో హోరా హోరీ పోరు కొనసాగుతోంది. రెండు స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. మరో రెండు స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యత పదర్శిస్తోంది.