Formula E Race: హుస్సేన్‌సాగర్‌ తీరంలో సినీ, క్రికెట్‌ ప్రముఖుల సందడి..

Hyderabad: హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్‌ సందడిని తలపిస్తోంది.

Update: 2023-02-11 09:27 GMT

Formula E Race: హుస్సేన్‌సాగర్‌ తీరంలో సినీ, క్రికెట్‌ ప్రముఖుల సందడి..

Hyderabad: హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫార్ములా ఈ-రేసింగ్‌ సందడిని తలపిస్తోంది. ఈ-రేస్‌ను చూసేందుకు సినీ, క్రికెట్‌, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఫార్ములా ఈ-రేస్‌ వీక్షించేందుకు క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు చాహల్‌, శిఖర్‌ ధావన్‌ వచ్చారు. అలాగే.. ఈ పోటీలను వీక్షించేందుకు హీరో రామ్‌చరణ్‌తో పాటు.. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌, మహేష్‌బాబు తనయుడు గౌతమ్, పుల్లెల గోపీచంద్‌ తరలివచ్చారు. దీంతో హుస్సేన్‌సాగర్‌ తీరమంతా సందడి వాతావరణం నెలకొంది.

ఇండియాలో తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ రేసింగ్ జరుగుతోంది. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన మెగా ఇంటర్నేషనల్ ఈవెంట్‌ సందర్భంగా హుస్సేన్‌ సాగర్ తీరాన స్ట్రీట్ సర్క్యూట్‌పై కార్లు రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటల 40 నిమిషాలకు ఫార్ములా ఈ క్వాలిఫైయింగ్ రేస్ ప్రారంభం కాగా.. కాసేపట్లో మెయిన్‌ రేస్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగున్నర గంటల వరకు మెయిన్ రేస్ కొనసాగుతుంది.

హై ఓల్టేజ్ కార్ రేసింగ్‌ను చూసేందుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు, ప్రతినిధులు తరలి వచ్చారు. సినీ ప్రముఖులు, క్రికెట్ ఆటగాళ్లు, రాజకీయ నాయకులు కూడా ఈ రేసింగ్ చూసేందుకు వచ్చారు. ఈ రేసింగ్‌ను 21 వేల మంది చూసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ రేసింగ్‌లో 11 టీములు, 22 ఎలక్ట్రిక్ కార్లు పాల్గొన్నాయి. గంటకు 322 కిలోమీటర్ల హైస్పీడ్‌తో రేసింగ్ కార్లు దూసుకెళుతున్నాయి.

Tags:    

Similar News