Hyderabad: ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త పడేస్తున్నారా? ఐతే అంతే సంగతులు..

Hyderabad: నగరంలో చెత్త సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఇంటింటి సేకరణ చేస్తున్నా వీధుల్లో, రోడ్ల పక్కన చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి.

Update: 2024-06-15 03:00 GMT

Hyderabad: ఎవరూ చూడట్లేదని రోడ్లపై చెత్త పడేస్తున్నారా? ఐతే అంతే సంగతులు..

Hyderabad: నగరంలో చెత్త సమస్య రోజురోజుకు తీవ్రతరమవుతోంది. ఇంటింటి సేకరణ చేస్తున్నా వీధుల్లో, రోడ్ల పక్కన చెత్త కుప్పులే దర్శనమిస్తున్నాయి. వర్షం పడితే ఇక ఆ ప్రాంతాల గుండా వెళ్లలేం. ఫైన్ వేస్తామని హెచ్చరించినా నగరవాసుల్లో మార్పు కనిపించట్లేదు. అందుకే జీహెచ్‌ఎమ్‌సీ సరికొత్త ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఇక వీధుల్లో, రోడ్లపై చెత్త వేస్తే ఇట్టే దొరికిపోతారు.

గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపు 22 లక్షల గృహాలున్నాయి. వీటి నుంచి ప్రతి నిత్యం టన్నుల్లో చెత్త ఉత్పన్నమవుతుంది. అయితే వచ్చిన వాటిని వచ్చినట్టు జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తుంటారు. ఇంటింటి చెత్త సేకరణ కోసం 4500 స్వఛ్చ ఆటోలు అందుబాటులో ఉన్నాయి. అయితే స్వఛ్చ ఆటో డ్రైవర్లు ఆ చెత్త తీసుకువెళ్తున్నందుకు కొంత మొత్తాన్ని తీసుకుంటారు. డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని కొందరు, చెత్త ఆటోలు రావడం లేదనిమరికొందరు రోడ్లపైనే వాటిని పడేస్తున్నారు. ఇలా వేస్తుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నారు జీహెచ్‌ఎమ్‌సీ కార్మికులు. ప్రస్తుతం నగరంలో 2300 చెత్త కుప్పలున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వెయ్యడం వల్ల వర్షం వచ్చిన సమయంలో ఇబ్బంది తీవ్ర రూపం దాల్చుతోంది. అందుకే చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేస్తే 1000 రూపాయల వరకు ఫైన్ వేస్తున్నారు జీహెచ్‌ఎమ్‌సీ అధికారులు. ఐతే ఫైన్ నుంచి తప్పించుకునేందుకు చెత్తను బహిరంగ ప్రదేశాలలో వేసే వారు ఎవ్వరికి కనిపించకుండా రాత్రి సమయాల్లో వేస్తున్నారు. తాజాగా అలాంటి ప్రదేశాలను గుర్తించి సిసి కెమెరాలను ఏర్పాటు చేసారు. ఎల్బీనగర్ సర్కిల్లోని ఉప్పల్, చిలకానగర్లో చెత్తకుప్పలను తొలగించి సీసీ కెమెరాలు, మైకులను ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. ఇది విజయవంతం అయితే నగరమంతా ఇదే విధానాన్ని అమలు చెయ్యాలని యోచిస్తున్నారు. సీసీ కెమెరాలు, మైకులకు కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా నిధులను సమీకరించాలని అనుకుంటున్నారు. ఇందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు అధికారులు. అన్ని చోట్ల ఇదే తరహాలో పెట్టి బహిరంగ ప్రదేశాలలో చెత్త నిర్మూలన చెయ్యనున్నారు అధికారులు.

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం చాలా వరకు సక్సెస్ అయింది. ఇంటింటి చెత్త సేకరణ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయడం చాలా వరకు తగ్గింది. ఐనా కొంతమంది మాత్రం ఇంకా రోడ్ల పక్కన చెత్తను వేస్తున్నారు. ఇంటి వరకు చెత్త ఆటోలు రాకపోవడం, డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే వంకతో రోడ్ల పక్కన చెత్తను పడేస్తున్నారు. ఫలితంగా ఆ ప్రాంతం అంతా దుర్గంధం వెదజల్లుతోంది. ఆ ప్రాంతం అంద విహీనంగా మారుతోంది. దీంతో స్వచ్చ హైదరాబాద్ స్ఫూర్తి దెబ్బతింటోంది. అందుకు జీహెచ్‌ఎంసీ ఇలా వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఐతే ఎన్ని ఏర్పాటు చేసినా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు కావాలంటున్నారు అధికారులు.

Tags:    

Similar News