ఇవాళ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం రికార్డుచేయనున్న సీబీఐ అధికారులు

* ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల అపాయింట్‌మెంట్

Update: 2022-12-11 02:18 GMT

ఇవాళ ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం రికార్డుచేయనున్న సీబీఐ అధికారులు

CBI: తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు ఇవాళ ఎమ్మెల్సీ కవితనుంచి సాక్ష్యం తీసుకోనున్నారు. ఢిల్లీలో అరెస్టయిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ప్రస్తావనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితనుంచి సాక్ష్యం తీసుకోడానికి ముందస్తుగా CRPC 160 నోటీసు ఇచ్చారు. తొలుత సీఆర్ పీసీ 160 నోటీసును అందుకున్న కవిత ఈనెల 6 తేదీన అందుబాటులో ఉంటామని ఆప్షన్ ఎంపిక చేసుకున్నారు. ఆతర్వాత సాక్ష్యం ఇచ్చే విషయంలో కవిత విముఖత వ్యక్తంచేస్తూ సీబీఐకి లేఖరాశారు.

లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించిన ఫిర్యాదుకాపీ, ఎఫ్ఐఆర్ కాపీ కావాలని సీబీఐ అధికారులను అభ్యర్థించారు. తను కోరిన కాపీలు అందుబాటులో లేకపోవడంతో సాక్ష్యం ఇచ్చే విషయంలో మనసు మార్చుకున్నారు. ఈనెల ఆరోతేదీన సూచించిన సమయానికి అందుబాటులో ఉంబోనని CBI అధికారులకు మరో లేఖను పంపారు. దీంతో ఆరోతేదీ జరగాల్సిన వాంగ్మూల రికార్డు ప్రక్రియ వాయిదా పడింది.

సాధారణంగా ఫిర్యాదు కాపీలోనూ, ఎఫ్ ఐఆర్ కాపీలోనూ సాక్షుల పేరు ఉండదని తెలుసుకున్న కవిత మరోసారి సీబీఐ అధికారులకు అందుబాటులో ఉండే తేదీలను సూచించారు. MLC కవిత అభ్యర్థనను పరిశీలించిన అధికారులు సాక్ష్యం తీసుకోడానికి ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. ఈమేరకు ఈరోజు ఉదయం 11గంటలకు CBI అధికారులు MLC కవిత నుంచి వాంగ్మూలం రికార్డు చేయనున్నారు.

Tags:    

Similar News