Telangana: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్.. కాంగ్రెస్, బీజేపీలోకి వలసల పర్వం
Telangana: ఎమ్మెల్యే, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలపై ఇరు పార్టీల ఫోకస్
Telangana: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జాతీయ పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో వలసలను కొనసాగిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎక్కువ స్థానాలు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. గులాబీ నేతలను జాతీయ పార్టీలు టార్గెట్ చేసినట్టు సమాచారం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ప్రతినిధులు ఫోకస్ చేశాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత కాంగ్రెస్‌లోకి వలసల ప్రవాహం పెరిగిపోయింది. లోకల్ నేతలు అడ్డుకట్ట వేసిన ఆగకుండా ఏదో ఓ సాయంతో పార్టీలో జాయిన్ అవుతున్నారు. మాజీ మంత్రుల నుండి మొదలుకుని సర్పంచ్‌ల వరకు అందరూ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.
తాజాగా సర్పంచ్‌ల పదవి కాలం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజార్టీ మాజీ సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్‌గా లేకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేయడానికి ఇప్పుడే కాంగ్రెస్‌లోకి వచ్చి కర్చీఫ్ వేసుకుంటున్నారు. మరొ వైపు ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్‌లు మేయర్‌లు డిప్యూటీ మేయర్‌లు సైతం కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.