హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌

High Court: తనపై జారీ చేసిన లుక్‌ ఔట్‌ నోటీసులు రద్దు చేయాలని విజ్ఞప్తి

Update: 2024-04-04 05:35 GMT

హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌

High Court:  బేగంపేట్ ప్రగతిభవన్‌ వద్ద ర్యాష్ డ్రైవింగ్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనపై జారీ చేసిన లుకౌట్ నోటీసులు రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించాడు మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్. డిసెంబర్ 24వ తేదీన బేగంపేట్‌లోని ప్రగతిభవన్ ముందు బారీకేడ్‌ను కారుతో ఢీకొట్టాడు రాహిల్‌. అయితే రహీల్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను నిందితుడిగా చేర్చారు పోలీసులు. ప్రమాదం కేసులో తనకు బదులుగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోవాలని వేరే వ్యక్తిని ప్రేరేపించాడు రహీల్.

దీంతో కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించారని తండ్రీకొడుకులపై ఎఫ్‌ఐర్ నమోదు చేశారు పోలీసులు. అయితే మూడు నెలల నుంచి దుబాయ్‌లోనే ఉన్నాడు రాహిల్. తాను పోలీసుల విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పిటిషన్‌లో తెలిపాడు రాహిల్. ‎

Tags:    

Similar News