Vijayawada: దుర్గమ్మ సేవలో తెలంగాణ మంత్రులు భట్టి, శ్రీధర్‌బాబు
Vijayawada: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు.
Vijayawada: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు విజయవాడ అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, ఈవో రామారావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం భట్టి విక్రమార్కకు వేదాశీర్వచనం అందజేశారు అర్చకులు. అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు. ఎన్నో ఆశలతో ఏర్పడిన తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు భట్టి. సోమవారం మంగళగిరిలో నిర్వహించిన వైఎస్సార్ 75వ జయంతి సభలో తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు పాల్గొన్న విషయం తెలిసిందే.