బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గవర్నర్ తమిళిసైతో ప్రత్యేకంగా భేటీ ...
Tamilisai Soundararajan: హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను రాష్ట్రంలో వివిధ యూనివర్శిటీల విద్యార్థులు కలిసి సమస్యలను వివరించారు
Tamilisai Soundararajan: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తెలంగాణ గవర్నర్ తమిళిసైతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను రాష్ట్రంలో వివిధ యూనివర్శిటీల విద్యార్థులు కలిసి సమస్యలను వివరించారు. బాసర ట్రిపుల్ ఐటీలో జరిగిన పుడ్ పాయిజన్‌పై గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. తన వంతు బాధ్యతగా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేలా సహకరిస్తామని గవర్నర్ తమిళిసై భరోసా ఇచ్చారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర‌్భంగా తెలంగాణలో 75 కాలేజీలను సందర్శించబోతున్నట్లు గవర్నర్ తెలిపారు. అందులో బాసర ట్రిపుల్ ఐటీ కూడా ఉందని తమిళిసై విద్యార్థులతో అన్నారు. యూనివర్శిటీల్లో విద్యార్థులకు మంచి ఆహారం, నాణ్యమైన విద్య, వసతి, ఉద్యోగం అందించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత కల్పించేవిధంగా సిఫార్సు చేస్తామన్నారు. విద్యార్థులు జాబ్ సీకర్స్ మాత్రమే కాదు జాబ్ క్రియేటర్స్ అనే విషయాన్నిగుర్తుంచుకోవాలని అభినందించారు.