Bandi Ramesh: కూకట్‌పల్లి అభివృద్ధిపై మాటలే తప్ప చేతల్లేవు
Bandi Ramesh: అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తాం
Bandi Ramesh: కూకట్‌పల్లిలో అభివృద్ది అనేది మాటలపై తప్ప చేతలలో లేదని కూకట్‌పల్లి కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఆరోపించారు. కూకట్‌పల్లిలోని ఓ హోటల్ లో ఏఐసిసి అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ తో కలిసి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధికి మెరుగులు దిద్ది, అభివృద్ది చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు బండి రమేష్ .కూకట్‌పల్లిలో సైతం అభివృద్ది జరిగిందేమి లేదని, సంక్షేమ పథకాలు అర్హులకు అందటం లేదన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని తెలిపారు.