Supreme Court Against MLC Jeevan Reddy: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి చుక్కెదురు..
Supreme Court Against MLC Jeevan Reddy: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్కెదురైంది.
Supreme Court Against MLC Jeevan Reddy: సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చుక్కెదురైంది. సచివాలయం కూల్చివేతపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ సచివాలయం భవనాలు కూల్చివేతకు హైకోర్టు జూన్ 29న అనుమతిచ్చింది. హైకోర్టుతీర్పును సవాల్ చేస్తూ జీవన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం. సచివాలయ కూల్చివేత అంశంపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్.కె కౌల్, జస్టిస్ ఎం.ఆర్ షాతో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పాటు మరో న్యాయవాది ఉదయ్‌కుమార్ సాగర్ వాదనలు వినిపించారు. ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టు సమగ్రంగా పరిశీలించిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా భవనాలు ఉన్నాయా? లేదా? అనే విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయని, ఆర్టికల్ 136 ప్రకారం విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.