Basara: తెరుచుకున్న బాబ్లీ గేట్లు... ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి
Basara: బాసర వైపు పరుగులు తీస్తున్న వరద నీరు
Basara: నిర్మల్ జిల్లా బాసర సరస్వతి క్షేత్రంలో గోదావరి నదీ ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతం మహారాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలో గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వేద భారతి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించే గోదావరి నిత్య హారతి శివలింగాలను తాకుతూ గోదావరి పరవళ్ళు తొక్కుతుంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఇటీవల ఎత్తివేయడంతో బాసర వైపు వరద నీరు పరుగులు తీస్తుంది. బాసరా నది నిండుకుండలా మారడంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తున్నారు.