TS Group 1 Posts: గ్రూప్ వన్ పోస్టులకి అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!
TS Group 1 Posts: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు.
TS Group 1 Posts: తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైంది. వరుసగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోలీసు నోటిఫికేషన్ రాగా గ్రూప్ 1 నోటిషికేషన్ కూడా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇదే తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్ కావడం విశేషం.. మొత్తం 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే గ్రూప్ వన్‌లో ఇంటర్వ్యులను రద్దు చేసిన విషయం తెలిసిందే.. ప్రిలిమ్స్, మెయిన్స్ ద్వారానే గ్రూప్ -1 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే అప్లై చేసేముందు అభ్యర్థులు కొన్ని విషయాలని గమనించాలి.
మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుకు మే 31ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ (https://www.tspsc.gov.in/website) లో ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
గ్రూప్-1లో ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. 900 మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. టీఎస్పీఎస్సీ మొదటి సారి 95 శాతం స్థానిక రిజర్వేషన్లతో జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
గ్రూప్ ఎగ్జామ్ కు అప్లై చేసుకోవడానికి ముందు అభ్యర్థులు తప్పనిసరిగా వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) చేసుకోవాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది జులై/ఆగస్టు నెలలో ఉండే అవకాశం ఉంది. మెయిన్స్ నవంబర్/డిసెంబర్లో ఉంటుందని అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి అభ్యర్థులు అన్ని విద్యార్హతలను కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 42, డీఎస్పీ 91, సీటీవో 48, ఎంపీడీవోలు 121, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్స్ 26, మున్సిపల్ కమిషనర్లు 41, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ 40 పోస్టులు భర్తీ చేయనున్నారు.