Revanth Reddy: రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తి బాధ్యత అందెశ్రీదే

Revanth Reddy: సంగీత దర్శకుడిని ఎవరు పెట్టాలనేది అందెశ్రీ ఇష్టం

Update: 2024-05-28 14:08 GMT

Revanth Reddy: రాష్ట్ర గీతం రూపకల్పన పూర్తి బాధ్యత అందెశ్రీదే

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర గీతంపై కొన్ని రోజులుగా వివాదం చెలరేగడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర గీతం రూపకల్పన బాధ్యతలను పూర్తిగా అందె శ్రీకి ఇచ్చామన్నారు. అందెశ్రీ ఎవరిని ఎంచుకుని గేయ రూపకల్పన చేస్తారనేది ఆయన ఇష్టమని చెప్పారు. ఏ సంగీత దర్శకుడిని పెట్టి గేయ రూపకల్పన చేయాలనేది తన పని కాదన్నారు. సంగీత దర్శకుడు ఎంపిక విషయంలో తనకేం సంబంధం లేదన్నారు సీఎం.

అధికారిక చిహ్నం మార్పుతో పాటు పలు అంశాలపై సైతం ఆయన మాట్లాడారు. తెలంగాణ అంటే త్యాగాలు, పోరాటాలు అని రాచరిక వ్యవస్థకు తావులేదన్నారు. తెలంగాణ తల్లి, గీతం స్పురించేలా తెలంగాణ చిహ్నం ఉంటుందని చెప్పారు. తెలంగాణ చిహ్న రూపకల్పన నిజామాబాద్‌కి చెందిన వ్యక్తికి ఇచ్చామని సీఎం అన్నారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నన్ని రూపొందిస్తామన్నారు.

Tags:    

Similar News