Telangana: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి తప్పిన ప్రమాదం
Telangana: నల్గొండకు వెళ్తుండగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ప్రమాదం
Telangana: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రమాదం తప్పింది. నల్గొండకు వెళ్తుండగా రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. గుత్తా సుఖేందర్ రెడ్డి, అతని భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. ప్రమాదం తర్వాత గుత్తా నల్గొండకు వెళ్లకుండా తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశారు.