TS News: భద్రాద్రి రామాలయంలో వెలుగుచూసిన భారీ మోసం.. రామయ్య విరాళం సొమ్ము స్వాహా..

Bhadrachalam: భద్రాద్రి ఆలయం మరో వివాదంలోకి చిక్కుకుంది.

Update: 2024-03-01 15:45 GMT

TS News: భద్రాద్రి రామాలయంలో వెలుగుచూసిన భారీ మోసం.. రామయ్య విరాళం సొమ్ము స్వాహా..

Bhadrachalam: భద్రాద్రి ఆలయం మరో వివాదంలోకి చిక్కుకుంది. భక్తులు విరాళంగా ఇచ్చిన 20 లక్షల సొమ్ము పక్కదారి పట్టినట్లు దాతలే ఆరోపించారు. ఉద్యోగుల వ్యవహారంపై ఆలయ ఈవో రమాదేవి సీరియస్ అయ్యారు. అయితే అందుకు ఆధారాలు లేకపోవడంతో విచారణ చేసి నిర్ణయం తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. భద్రాచలం ఈవో కార్యాలయం పక్కన గత మూడు ఏళ్ల క్రితం జానకీ సదనం నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.

ఆ సమయంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు కొంతమంది ఉద్యోగులకు గదుల నిర్మాణానికి నాలుగు విడతలుగా 20 లక్షలు చెల్లించినట్లు దాతలే స్వయంగా చెబుతున్నారు. అయితే 20 లక్షలకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడంతో.. ఆ డబ్బు ఇచ్చిన దాతలు కార్యాలయాలకు వచ్చి డబ్బులు తీసుకున్న ఉద్యోగులతో వివాదానికి దిగారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. భద్రాచలం ఈవో రమాదేవికి ఈ విషయంపై ఫిర్యాదు అందడంతో విచారణ పూర్తిస్థాయిలో జరిపి.. ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. భక్తులు ఇచ్చిన నిధులు గోల్ మాల్ కావడంపై భద్రాద్రివాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

Tags:    

Similar News