Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
Telangana: 9 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
Telangana: తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్‌గా సురేంద్రమోహన్‌కు పూర్తి బాధ్యతలను అప్పగించింది. హార్టికల్చర్ డైరెక్టర్‌గా యాస్మిన్ బాషా, తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ వైస్ ఛైర్మన్‌గా మలూర్స్‌ను నియమించింది. ఇక ములుగు జిల్లా అదనపు కలెక్టర్‌గా సిరిజను నియమించగా, మైనార్టీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా ఇక్బాల్‌ను అపాయింట్ చేసింది. అటు ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నిర్మల క్రాంతిని నియమించగా, హెచ్‌ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ జాయింట్ సెక్రటరీగా వినయ్ కృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఇటు హెచ్‌ఎండీఏ స్పెషల్ గ్రేడ్ అడిషనల్ కలెక్టర్‌గా అసదుల్లాకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.