Coronavirus: తెలంగాణలో ఇవాళ 2,909 కోవిడ్ కేసులు నమోదు

Coronavirus: 3 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు * ఇవాళ 2,909 కోవిడ్ కేసులు నమోదు

Update: 2021-04-10 04:32 GMT

కరోన వైరస్

Coronavirus: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2వేల 909 మంది కరోనా బారినపడ్డారు. మరో 584 మంది మహమ్మారి బారినుంచి కోలుకోగా, కొత్తగా ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.24 లక్షలకు చేరింది. ఇందులో 1752 మంది బాధితులు మరణించగా, మరో 3.04 మంది డిశ్చార్జీ అయ్యారు. మొత్తం కేసుల్లో 17వేల, 791 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ప్రస్తుతం 11వేల, 495 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.

కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 487 కేసులు ఉండగా, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 289, రంగారెడ్డిలో 225 చొప్పున ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిన్న 1,11,726 మందికి కరోనా పరీక్షలు చేశారు.

Full View


Tags:    

Similar News