Redmi Book: రెడ్‌మి బుక్ ప్రో మరియు రెడ్‌మి బుక్ ఈ-లెర్నింగ్ మోడల్ లాప్ టాప్స్ తాజాగా భారత మార్కెట్ లోకి విడుదలై ఈ కామర్స్ లో శుక్రవారం నుండి వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండు కొత్త ల్యాప్‌టాప్‌లు 11వ జెనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌లతో పాటు 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఈ ల్యాప్‌టాప్‌లు ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేలను కలిగి ఉండటమే కాకుండా ఒకసారి ఛార్జింగ్ ఫుల్ చేస్తే సుమారుగా 10 గంటలు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇక షియోమి ఫైల్‌లను షేర్ చేసుకోడానికి ఎమ్ఐ స్మార్ట్ షేర్ యాప్‌ను కూడా ఈ లాప్ టాప్స్ లో కంపెనీ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి కస్టమర్లకు అందుబాటులో ఉంచింది.
ఈ రెండు రకాల వెర్షన్ లను అందుబాటులోకి తెచ్చిన షియోమి... రెడ్‌మి బుక్ ప్రోని ఆఫీస్ వర్క్ లేదా ఇతర వ్యాపారానికి సంబంధించిన పనుల కోసం తయారు చేయగా, రెడ్‌మి బుక్ ఈ-లెర్నింగ్ మాత్రం పిల్లలు లేదా చదువుకునే వారికి ఉపయోగపడేలా డిజైన్ చేశారు. రెడ్‌మి బుక్ ప్రో బూట్ టైమ్ 12 సెకన్ల లోపు ఉండగా, రీబూట్ కి 24 సెకన్ల లోపే ఉంటుందని తెలిపింది. ఇక 2 వాట్స్ డిటిఎస్ స్పీకర్ తో పాటు కాన్ఫరెన్స్ కాల్స్ వంటి వాటి కోసం 720పి తో పాటు రెండు మైక్రో ఫోన్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి.
రెడ్‌మి బుక్ ఈ-లెర్నింగ్ మోడల్ లో 15.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో పాటు 8 జిబి ర్యామ్ తో పాటు విండోస్ 10 ని ఇంటర్నల్ గా కలిగి ఉంది. ఇక 2 వాట్స్ డిటిఎస్ స్పీకర్ తో పాటు వైఫై, బ్లూటూత్ ల సౌకర్యం కూడా ఉంది. ఇక ధరల విషయానికొస్తే..
రెడ్‌మి బుక్ ప్రో 8 జిబి ర్యామ్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ కి 49999 రూపాయలుగా ఉంది.
రెడ్‌మి బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ లో 8 జిబి ర్యామ్ 256 జీబీ కాన్ఫిగరేషన్ ధర 41,999
8 జిబి ర్యామ్ 512 జీబీ కాన్ఫిగరేషన్ ధర 44,999 గా నిర్ణయించారు.
ఇక ఈ లాప్ టాప్స్ ఆగష్టు 6న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్ కార్ట్, ఎమ్ఐ.కామ్, ఎమ్ఐ హోమ్ సర్వీసెస్ లో అందుబాటులో ఉండనున్నాయి.