World Most Costly Smart Watches: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్‌వాచ్‌లు.. వీటి ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
World Most Costly Smart Watches: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ పెరుగుతోంది.
World Most Costly Smart Watches: భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్ పెరుగుతోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రస్తుతం సాధారణ వాచ్‌లకు బదులుగా స్మార్ట్‌వాచ్‌లను కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో బడ్జెట్ వాచ్‌లకు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పటికీ, మార్కెట్లో కొన్ని ప్రత్యేక స్మార్ట్‌వాచ్‌లు ఉన్నాయి. వీట ధర వింటే మాత్రం మీరు ఆశ్చర్యపోవాల్సిందే.
ఈ వాచీలు వచ్చే ధరకు మీరు స్పోర్ట్స్ బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కొన్ని గడియారాల ధరలు, వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మోంట్‌బ్లాంక్ టైమ్‌వాకర్ ఇ-స్ట్రాప్: దీనిని జర్మన్ కంపెనీ మోంట్‌బ్లాంక్ తయారు చేసింది. 2015లో ఈ వాచ్ విడుదలైంది. దీన్ని వైర్‌లెస్ నెట్‌వర్క్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దీని ధర దాదాపు రూ.2,31,626గా ఉంది. దీని ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఈ వాచ్‌లో కాల్, మెసేజింగ్ సౌకర్యాన్ని అందించారు. ఈ వాచ్‌లో ఫిట్‌నెస్ యాక్టివిటీ ట్రాకర్ కూడా అందుబాటులో ఉంది.
లూయిస్ విట్టన్ టాంబోర్ హారిజోన్: ప్రపంచంలోని ఖరీదైన వాచీల జాబితాలో ఈ వాచ్ రెండవ స్థానంలో నిలిచింది. దీని ధర దాదాపు రూ.2,22,932గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. దీని బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంది. ఇందులో సిటీ గైడ్ యాప్ కూడా అందుబాటులో ఉంది. అయితే ఇందులో ఫిట్‌నెస్ ట్రాకింగ్ మోడ్ లేకపోవడం కాస్త నిరాశ పరుస్తుంది.
కైరోస్ హైబ్రిడ్ వాచ్: ఈ కైరోస్ వాచ్ ఎక్కువ మంది మనసును దోచుకుంది. అందుకే దీనికి బెస్ట్ డిజైన్ అవార్డు కూడా లభించింది. దీని ధర దాదాపు రూ.1,85,777గా ఉంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో డ్యూయల్ డిస్‌ప్లే లభిచడం విశేషం. డిజిటల్ డిస్ప్లేతోపాటు అనలాగ్ స్క్రీన్ కలిగి ఉంది. ఇందులో మెసేజింగ్ సౌకర్యం కూడా ఉంది. వాచ్ బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. అలాగే ప్రాసెసర్ స్పీడ్ కూడా చాలా వేగంగా ఉండడం విశేషం. ఇందులో మరో విశేషమేమిటంటే మైక్రోఫోన్ మద్దతును కూడా అందిస్తుంది.
TAG Heuer Carrera: ఈ వాచ్ ఖరీదైన స్మార్ట్‌వాచ్‌ల జాబితాలో నాల్గవ స్థానంలో నిలిచింది. అయితే ఫీచర్లు అద్భుతంగా ఉండడంతో దీని ధర దాదాపు రూ.1,11,466గా ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ను గూగుల్, ఇంటెల్ సంయుక్తంగా తయారు చేశాయి. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇందులో స్క్రాచ్ రెసిస్టెంట్ స్క్రీన్ అందించారు. ఈ స్మార్ట్ వాచ్ 1.6Ghz ఇంటెల్ ప్రాసెసర్, 410mAh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే, 25 గంటల వరకు బ్యాకప్ అందిస్తుంది. ఈ వాచ్‌లో అంతర్నిర్మిత వాయిస్ కమాండ్‌లు, GPS, మైక్రోఫోన్, Google Translate, Google Map, Google Fit వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.