WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. 'ఇన్‌ యాప్‌ డయలర్' పేరుతో..!

WhatsApp: యూజర్ల అవసరాలకు, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

Update: 2024-06-24 10:19 GMT

WhatsApp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌.. 'ఇన్‌ యాప్‌ డయలర్' పేరుతో.. 

WhatsApp: వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో కచ్చితంగా ఉండే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. అందుకే ప్రపంచంలో అత్యధికమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్‌కు గుర్తింపు ఉంది. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ అందుబాటులోకి వస్తున్నా.. వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉండడానికి ఇందలోనూ ఫీచర్లే కారణంగా చెప్పొచ్చు.

యూజర్ల అవసరాలకు, ప్రైవసీకి పెద్దపీట వేస్తూ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సాధారణంగా మనం నార్మల్‌ కాల్‌ చేయాల్సి వస్తే ఫోన్‌లోని డైలర్‌ను ఓపెన్‌ చేసి కాల్‌ చేస్తాం. ఒకవేళ వాట్సాప్‌లో ఉన్నా యాప్‌ నుంచి బయటకు వచ్చి కాల్‌ చేయాల్సిన పరిస్థితి. అయితే వాట్సాప్‌ తీసుకొస్తున్న కొత్త ఫీచర్‌ సహాయంతో ఇకపై వాట్సాప్‌ నుంచే నేరుగా నార్మల్ కాల్ చేసుకోవచ్చు.

ఈ మేరకు మెటా ఇప్పటికే అడుగులు వేస్తోంది. ‘ఇన్-యాప్ డయలర్ ఫీచర్‌’ని తీసుకొచ్చేందుకు వాట్సాప్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఇకపై ఎవరికైనా కాల్ చేయాలంటే యాప్ నుంచి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉండదు. నేరుగా వాట్సప్ నుంచే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆండ్రాయిడ్ 2.24.13.17 అప్‌డేటెడ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉందని WABetaInfo పేర్కొంది.

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్‌లో కుడివైపున దిగువన కొత్త ఫ్లోటింగ్ యాక్షన్ బటన్‌ కనిపిస్తుందని, దీనికి యాక్సెస్ ఇస్తే కాల్స్ సులభంగా చేసుకోవచ్చునని వాట్సప్‌బీటాఇన్ఫో తెలిపింది. కాలింగ్‌తో పాటు మెసేజింగ్ షార్ట్‌కట్ డయలర్ స్క్రీన్‌ కూడా అందుబాటులోకి వస్తుందని వివరించింది. ప్రస్తుత టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు.

Tags:    

Similar News