Truecaller: ఆన్‌లైన్‌లో మోసపోతే ఇన్సూరెన్స్‌.. ట్రూకాలర్‌లో కొత్త సేవలు..!

Truecaller: ఆన్‌లైన్‌లో మోసపోతే ఇన్సూరెన్స్‌.. ట్రూకాలర్‌లో కొత్త సేవలు

Update: 2024-07-01 12:30 GMT

Truecaller: ఆన్‌లైన్‌లో మోసపోతే ఇన్సూరెన్స్‌.. ట్రూకాలర్‌లో కొత్త సేవలు

Truecaller: ప్రస్తుతం ఆన్‌లైన్‌ మోసాలు సర్వసాధారణంగా మారిపోయాయి. మారిన టెక్నాలజీ పాటు నేరాలు కూడా మారాయి. ఎన్ని రకాల జాగ్రత్తలు పాటించినా కేటుగాళ్లు సరికొత్త మార్గంలో ప్రజలను నిండా ముంచేస్తున్నారు. అయితే ప్రతీ దానికి ఇన్సూరెన్స్ ఉన్నట్లుగానే ఆన్‌లైన్‌ మోసాలకు కూడా ఇన్సూరెన్స్ ఉంటే భలే ఉంటుంది కదూ! ఇలాంటి ఆలోచనే చేసింది ప్రముఖ కాలర్‌ ఐడీ సంస్థ ట్రూకాలర్‌.

ఆన్‌లైన్‌ మోసాలా బారిన పడిన వారికి ఇన్సూరెన్స్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ట్రూకాలర్స్‌ ఫ్రాడ్‌ ఇన్సూరెన్స్‌ పేరుతో ఈ కొత్త సేవలను తీసుకొచ్చారు. ఆన్‌లైన్‌ స్కామ్‌ల బారిన పడిన వారికి ఈ సేవలు ఉపయోగపడనున్నాయి. ట్రూకాలర్‌ ఈ సేవలను తొలుత భారత్‌లోనే తీసుకురావడం విశేషం. అయితే ప్రస్తుతం ట్రూకాలర్‌ వార్షిక ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కు ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఈ పాలసీని తీసుకున్న వారు, ఆన్‌లైన్‌లో మోసపోయినట్లయితే వారికి రూ. 10 వేల వరకు కవరేజ్‌ లభించనుంది. ఈ పాలసీని ఆండ్రాయితో పాటు ఐఓస్‌ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇతరదేశాల్లోనూ ఈ సేవలను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గోతో కలిసి ఈ పాలసీని తీసుకొచ్చారు. యూజర్లు ఈ ఇన్సూరెన్స్‌ను నేరుగా ట్రూకాలర్‌ యాప్‌లోనే తీసుకొవచ్చు. యూజర్లు పాలసీని యాక్టివేట్ చేసుకున్న తరువాత ఆన్‌లైన్‌లో మోసపోయినట్లయితే వారికి కవరేజ్ కింద రూ.10,000 లభిస్తాయి.

Tags:    

Similar News