iPhone SE 4 5G: ఈసారి మామూలుగా ఉండదు.. బడ్జెట్ ఐఫోన్ SE 4 5జీ వచ్చేస్తోంది..!
iPhone SE 4 5G: యాపిల్ అభిమానులు ఇప్పుడు iPhone SE 4 5G లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
iPhone SE 4 5G: యాపిల్ అభిమానులు ఇప్పుడు iPhone SE 4 5G లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించిన పలు లీక్‌లు వెలుగులోకి వచ్చాయి. ఇది ఐఫోన్ 14 వంటి డిజైన్‌తో వస్తుంది. ఇది 2025 మొదటి త్రైమాసికంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ఇప్పుడు రాబోయే బడ్జెట్ ఐఫోన్ మార్చి 2025లో మార్కెట్లోకి వస్తుందని కొత్త నివేదిక ధృవీకరించింది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలేంటో చూద్దాం.
MacRumors ఈ ఐఫోన్ గురించి సమాచారాన్ని అందించించారు. నివేదిక ప్రకారం కొందరు టెక్ నిపుణులు ఇటీవల ఆసియాలోని ఎలక్ట్రానిక్స్ తయారీదారులు, సరఫరాదారులతో సమావేశమయ్యారు. తన రీసెర్చ్ నోట్‌లో ఐఫోన్ SE 4 Q1 2025 చివరిలో లాంచ్ అవుతుందని సరఫరాదారులు ధృవీకరించారని పేర్కొన్నారు.
iPhone SE 4 ఆపిల్ రూపొందించిన 5G మోడెమ్‌ను కలిగి ఉంటుందని కూడా నివేదిక నిర్ధారిస్తుంది. ఇది Apple అంతర్గత 5G మోడెమ్‌ను కలిగి ఉన్న మొదటి iPhone ఐఫోన్ SE 4 అని పేర్కొన్న మునుపటి నివేదికకు అనుగుణంగా ఉంది. నివేదిక ప్రకారం స్మార్ట్‌ఫోన్‌లో TSMC నోడ్ ఆధారంగా ఆపిల్ మోడెమ్ ఉంటుంది. దాని కోడ్‌నేమ్ సెంటారీ.
iPhone SE 4 5G దాని మునుపటి మోడల్ ఐఫోన్ SE 3తో పోలిస్తే గణనీయమైన అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. ఇది మార్చి 2022లో లాంచ్ అయింది. iPhone SE 4 5G లీకైన ఫీచర్లను చూద్దాం.
రాబోయే iPhone 60 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.06-అంగుళాల LTPS OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2532x1170 పిక్సెల్‌లు, 460 ppi, 800 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. సిరామిక్ షీల్డ్ ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. ఇది Apple A18 చిప్‌సెట్‌ను ప్యాక్ చేస్తుంది. 8GB LPDDR5X RAMతో వస్తుంది. ఫోన్ iOS 18లో పని చేస్తుంది. Apple ఇంటిలిజెంట్ ఫీచర్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెల్ఫీల కోసం 12-మెగాపిక్సెల్ లెన్స్ ఉంటాయి. ఫోన్ 20W USB PD ఛార్జింగ్‌తో పాటు 15W Qi2, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌తో వస్తుంది.
ఇది కాకుండా FaceID సపోర్ట్‌తో వస్తుంది. IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతానికి iPhone SE 4 5G గురించి చాలా వివరాలు వెల్లడి కాలేదు, కానీ పుకార్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రాబోయే నెలల్లో దాని లాంచ్, మరింత సమాచారం వెల్లడయ్యే అవకాశం ఉంది.