Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.1000కే ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ మీ సొంతం..!

Moto G64 5G: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 'మొబైల్స్ బొనాంజా' సేల్ నడుస్తోంది. ఈ సేల్ నవంబర్ 21న ముగియనుంది.

Update: 2024-11-21 06:09 GMT

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్.. రూ.1000కే ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ మీ సొంతం..!

Moto G64 5G: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 'మొబైల్స్ బొనాంజా' సేల్ నడుస్తోంది. ఈ సేల్ నవంబర్ 21న ముగియనుంది. మీరు కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుని.. ఉత్తమ ఆఫర్‌ల కోసం చూస్తున్నట్లైతే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. అందులోనూ మీరు మోటరోలా ఫోన్ కోసం వెయిట్ చేస్తూ.. మీ బడ్జెట్ రూ.15 వేల లోపు ఉంటే ఈ సేల్‌ మీకు మంచి డీల్ అని చెప్పొచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ మొబైల్స్ బొనాంజా సేల్‌లో 'మోటరోలా జీ64 5జీ'ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మోటరోలా జీ64 5జీ స్మార్ట్‌ఫోన్‌ గత ఏప్రిల్‌లో లాంచ్ అయింది. అప్పుడు 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999తో రిలీజ్ చేసి.. కొన్ని రోజుల అనంతరం 3 వేలు పెంచింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 8జీబీ+128జీబీ ధర రూ.17,999గా ఉంది. మొబైల్స్ బొనాంజా సేల్ సందర్భంగా ఈ ఫోన్‌పై 16 శాతం తగ్గింపు ఉంది. దాంతో రూ.14,999కు అందుబాటులో ఉంది. మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే.. 5 పెర్సెంట్ క్యాష్‌బ్యాక్ వస్తుంది. మోటరోలా జీ64పై ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ కూడా ఉంది. ప్రస్తుతం రూ.13,850 ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ ఉంది. ఈ ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే.. మీరు రూ.1000 లోపే ఈ ఫోన్‌ను సొంతం చేసుకుంటారు. అయితే మీ పాత మొబైల్ కండిషన్ బాగుండి.. ఎలాంటి డామేజ్ లేకుంటేనే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి.

మోటరోలా జీ64 5జీ 6.5 ఇంచెస్ ఫుల్‌ హెచ్‌డీ+ ఐపీఎస్‌ ఎల్‌సీడీ స్క్రీన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 14తో వచ్చింది. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ సెన్సర్ ఉండగా.. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇచ్చారు. ఇందులో 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 33 వాట్స్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తోంది. మోటరోలా జీ64 5జీపై ఆఫర్ ఒక్క రోజు మాత్రమే ఉంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు వెంటనే కొనేసుకుంటే బెటర్.

Tags:    

Similar News