WhatsApp: 'మాటలు అక్షరాలుగా మారితే'... వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..!

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-06-28 09:33 GMT

WhatsApp: 'మాటలు అక్షరాలుగా మారితే'... వాట్సాప్‌లో మరో అదిరిపోయే ఫీచర్‌..!

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా సెక్యూరిటీకి పెద్దపీట వేస్తూ వాట్సాప్‌ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. అందుకే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్‌ యాప్‌గా పేరు గాంచిన వాట్సాప్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

వాట్సాప్‌లో ప్రస్తుతం వాయిస్‌ మెసేజ్‌ ఫీచర్‌ ఉన్న విషయం తెలిసిందే. అయితే మాటలు అక్షరాలుగా మార్చే ఫీచర్‌ ఉంటే భలే ఉంటుంది కదూ.. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది వాట్సాప్‌. ఈ కొత్త ఫీచర్‌ ఫోన్‌లో నేరుగా మాటలను అక్షరాల రూపంలోకి మార్చేస్తుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. వాబీటాఇన్ఫో వెబ్‌సైట్‌ నివేదిక ప్రకారం దీన్ని వాడుకోవటానికి అదనంగా 150 ఎంబీ డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

స్పీచ్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంతో ఈ కొత్త ఫీచర్‌ పనిచేస్తుంది. ఒకసారి డేటాను డౌన్‌లోడ్‌ చేసుకోగానే వాయిస్‌ మెసేజ్‌లు టెక్స్ట్‌ రూపంలో కనిపిస్తాయి. వాయిస్ మెసేజ్‌లు పక్కనున్న వారికి వినపడకుండా ఉండాలనుకునే సమయంలో ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. ప్రస్తుతానికి హిందీ, ఇంగ్లిష్, రష్యన్, పోర్చుగీస్, స్పానిష్‌ భాషల్లో ఉన్న ఈ ఫీచర్‌ను తర్వాత ఇతర ప్రాంతీయ భాషల్లోకి తీసుకురానున్నారి తెలుస్తోంది.

వాయిస్‌ టూ టెక్ట్స్‌ ఆప్షన్‌ కోసం ముందుగా.. భాషను ఎంచుకున్న తర్వాత అక్షరాల్లోకి మార్చే ప్రక్రియను ఎనేబుల్‌ చేసుకోవటానికి మరో డేటా ప్యాకేజీని డౌన్‌లోడ్‌ చేయాలని అడుగుతుంది. బీటా వర్షన్లలో అందుబాటులో ఉన్నప్పటికీ దీన్ని వాట్సప్‌ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే అందరికీ అందుబాటులోకి తేవచ్చని అనుకుంటున్నారు. ప్రస్తుతం టెస్టింగ్‌ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ పరిచయం చేయనున్నారు. 

Tags:    

Similar News